అన్నా క్యాంటీన్‌కు సజ్జా విరాళం

Mar 2,2024 23:28

ప్రజాశక్తి – చీరాల
మంగళగిరిలో అన్నా క్యాంటీన్ నిర్వహణకు చీరాల టిడిపి సీనియర్ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు విరాళం అందించారు. 100రోజుల పాటు క్యాంటీన్ నిర్వహణకు రోజుకు రు.10వేల చొప్పున రు.10లక్షల విరాళాన్ని క్యాంటీన్ నిర్వాహకులు అబద్దయ్యకు అందజేశారు. టిడిపి అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ల నిర్వహణతో పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చేందుకు చేపట్టిన అన్న క్యాంటీన్ల నిర్వహణ అభినందనీయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారానికి వచ్చిన తరువాత ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు యధావిధిగా కొనసాగుతాయని అన్నారు. అప్పటి వరకు టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన అన్న క్యాంటీన్ నిర్వహణకు తన వంతు సహకారం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గుత్తి శివయ్య, బాలు, సజ్జా రవికుమార్ పాల్గొన్నారు.

➡️