వైసిపి ఇన్‌ఛార్జి బాలాజీకి సత్కారం

Mar 7,2024 00:21

ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని నూతలపాడు గ్రామంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్ది యడం బాలాజీని ఘనంగా సత్కరించారు. జాతీయ నాయకుల విగ్రహాలకు నివాళి అర్పించిన అనంతరం సభ నిర్వహించారు. కార్యక్రమంలో నూతలపాడు సర్పంచి కాకర్లమూడి చిన్నయ్య, వైసిపి మండల కన్వీనర్ కటారి అప్పారావు, మాజీ ఎఎంసీ చైర్మన్ పోలూరు శివారెడ్డి, ఉప సర్పంచ్ బ్రహ్మారెడ్డి, పోలేరమ్మ ఆలయ అధ్యక్షులు ప్రభాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

➡️