రైతులకు ఎస్‌బిఐ సన్మానం

Dec 23,2023 23:56

ప్రజాశక్తి – పంగులూరు
రైతు దినోత్సవం సందర్భంగా ఇరువురు రైతులను ఎస్‌బిఐ సిబ్బంది ఘనంగా సన్మానించారు. శాలవాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి, రైతులకు, స్టేట్ బ్యాంకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని అన్నారు. రైతులు బ్యాంకు ఇచ్చే పంట రుణాలను సద్వినియోగం చేసుకొని పంటలు పండించి, సకాలంలో చెల్లిస్తే బ్యాంకు ఎల్లప్పుడూ రైతుకు సహకరిస్తుందని అన్నారు. రైతులకు అవసరమైన అనేక పథకాలు ఎస్‌విఐలో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌బిఐ పంగులూరు బ్రాంచి నుంచి ప్రతి ఏటా పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తున్న రైతులు నాగబోయిన వీర రాఘవయ్య, చిలుకూరి వీరరాఘవయ్యను శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంకు అకౌంటెంట్ వీరాంజనేయులు, క్యాష్ ఆఫీసర్ అనిల్ బాబు, అసోసియేట్లు జోసఫ్ సన్, రత్తయ్య చౌదరి, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి గుడిపూడి రామారావు, అంజయ్య, నాగరాజు పాల్గొన్నారు.

➡️