ఎన్నికల ప్రవర్తన నియమావళి కమిటీ ఎంపిక

Mar 2,2024 23:34

ప్రజాశక్తి – పంగులూరు
కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కమిటీ ఏర్పడినట్లు ఎంపీడీఒ కె మ్యాత్యూబాబు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల స్థాయిలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పడిందని తెలిపారు. ఎంపీడీఒ టీం లీడరుగా ఒక కానిస్టేబుల్, ఒక ఫోటోగ్రాఫర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఎన్నికల షెడ్యూలు రావడంతోనే ఈ కమిటీ పని అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీలు జరుపుతున్న వాటినీ అరికట్టటం, గ్రామాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలను మూసి వేయించడం, ఫ్లెక్సీలు, పోస్టర్లు వంటి వాటిని తొలగించడం, అభ్యర్థుల ప్రచార ఖర్చును ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయడం, ఎక్కడికక్కడ ప్రచారాలను క్రమబద్ధీకరించటం వంటి పనులు ఈ కమిటీ చేస్తుందని తెలిపారు. మండల ప్రజలు ఎక్కడ ఎలాంటి గొడవలకు పోకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని కోరారు.

➡️