సీనియర్ అసిస్టెంట్ గోపాలం మృతి

Nov 29,2023 00:04

ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు)
వేమూరు మండలంలోని చావలి గ్రామానికి చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాలం ఏడుకొండలు గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఈయన కొల్లూరు పంచాయతీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమన మృతి సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి, టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు చావలి గ్రామం వెళ్లి ఏడుకొండలు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన వెంట వేమూరు, కొల్లూరు మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

➡️