కుట్టు మిషన్ బహుకరణ

Mar 9,2024 00:18

ప్రజాశక్తి – ఇంకొల్లు
మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకొల్లుకు చెందిన శ్రీ మాత సంక్షేమ మహిళా మండలి సభ్యులు శ్వేత మిషన్‌ను ఉచితంగా ముస్లిం మహిళకు శుక్రవారం అందించారు. చిన్నగంజాం మండలం సంతరావురుకు చెందిన మాజీ జడ్పిటిసి యార్లగడ్డ లక్ష్మి, పలువురు మహిళలను సత్కరించారు. రోటరీ గంగ భవనంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో అధ్యక్షురాలు ఈ రమణ, కె అనంతలక్ష్మి, కరి శ్రీహరి, కె మాధవి, ఆర్ మాధవి, టి కవిత, జె సంధ్యా, కె రాదమాదవి, కె పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు.

➡️