అడ్డగించడం సిగ్గుచేటు

Feb 17,2024 00:04

ప్రజాశక్తి – నిజాంపట్నం
బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆటంకం కలిగించడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు బొమ్మిడి రామకృష్ణ అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు మండలంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో అడ్డగించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రారంభంకు ముందుగా గ్రామదేవత మొగధారమ్మ తల్లి ఆలయంలో పూజ నిర్వహిస్తుండగా వైసిపి కార్యకర్తలు తమని అడ్డకించి తమ ప్రాంతంలోకి రావొద్దు అంటూ గొడవలకు దిగడం దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలను భయాందోళనకు గురి చేసేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన టీడీపీ, జనసేన నాయకులు ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, రానున్న ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. జనసేన మండల అధ్యక్షుడు నరేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసిపికి ఎవ్వరూ రాసివ్వలేదని, ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య, టీడీపీ మండల అధ్యక్షులు ఓగిబోయిన వెంకట్ యాదవ్, నాయుడు గోపి, దండుప్రోలు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ బొర్రా సురేంద్ర, పిన్నిబోయిన చింతారావు యాదవ్, లంకే మీరయ్య, కన్నా మీరయ్య, ఖాదర్ బాబు, కొండేపు శ్రీను, ఇమ్రాన్, కీర్తి శ్రీను, పీతా సాయిబాబు, పండబోయిన కృష్ణ, నల్లపాటి యల్లయ్య, కూచిపూడి మోహనరావు, యేమినేని రమేష్ పాల్గొన్నారు.

➡️