మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

Mar 2,2024 23:38

ప్రజాశక్తి – అద్దంకి
మహా శివరాత్రి సందర్భంగా అద్దంకి చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులు, ప్రజల కోసం ఆర్టీసీ డిపో నుండి 30 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు డిపో మేనేజర్ రామ్మోహనరావు తెలిపారు. ఆయన విలేకరులతో శనివారం మాట్లాడారు. గత ఏడాది మాదిరిగానే సాధారణ చార్జీలు రూ.105 ఉంటుందని అన్నారు. నిర్దేశించిన సమయాల్లో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అద్దంకి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

➡️