సామాజిక రుగ్మతలకు చదువే ఔషధం

Mar 2,2024 23:14

ప్రజాశక్తి – నగరం
బాలల హక్కుల అమలుకు విఘాతం కలిగిస్తున్న బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహ వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా వంటి అపరిష్కృత సమస్యలన్నిటిని రూపుమాపడానికి సమాజాన్ని విద్యా వంతం చేయడం ఒక్కటే మార్గమని ఎంపిపి చితల శ్రీకృష్ణయ్య అన్నారు. నిరక్షరాస్యత అనేది లేకుండా చేయాలని అన్నారు. నిరుపేదల్ని విద్యావంతులుగా మార్చడం ద్వారా అన్ని రుగ్మతలకు చరమగీతం పాడొచ్చని అన్నారు. ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉందని అన్నారు. 27 సంక్షేమ పథకాల అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్‌ రత్నకుమారి మాట్లాడుతూ బాలికలకు బాల్యంలోనే వివాహాలు జరిపించటం వల్ల అనేకమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడేందుకు అవకాశం ఉందని అన్నారు. అంగన్‌వాడీ సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించడంలో తమ శాఖ కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సిఫార్డు స్వచ్ఛంద సంస్థ మండల కోఆర్డినేటర్ కొమరగిరి నాగేశ్వరరావు, బేతపూడి నాగేంద్రరావు, పెట్ల మరియజ్యోతి, సరిత, జస్టిస్ ఫర్ చిల్డ్రన్ జిల్లా కోఆర్డినేటర్ ప్రభాకరరావు పాల్గొన్నారు.

➡️