సూపర్‌సిక్స్‌పై టిడిపి ప్రచారం : గొట్టిపాటి హర్షవర్ధన్

Apr 4,2024 00:20 ##Addanki #Gottipati

ప్రజాశక్తి – సంతమాగులూరు
చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతోనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని అద్దంకి ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ అన్నారు. మండలంలోని కొప్పరంలో బుధవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. బీసీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ నవరత్నాల పేరుతో జనాన్ని మోసం చేశాడని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ధూపాటి ఏసోబు, తేలప్రోలు రమేష్, చేవూరి వాసురెడ్డి, అట్లా పెద వెంకటరెడ్డి, నెంబర్ మౌలాలి, ముల్లా సుభాని, సయ్యద్ సుభాని, గుంజి శ్రీను, గుంజి అంకమ్మరావు, కొనికి గోవిందమ్మ, గుమ్మా జ్యోతి, మాదాల సుబ్బారావు, మాజీ ఎంపీపీ సన్నెబోయిన ఏడుకొండలు, సన్నెబోయిన గురు యాదవ్, మాజీ ఎంపీటీసీ బోడె పాల్గొన్నారు.

➡️