సూపర్‌సిక్స్‌ పధకాలపై టిడిపి ప్రచారం

Feb 24,2024 23:22

ప్రజాశక్తి – రేపల్లె
చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని టిడిపి నాయకులు అనగాని శివప్రసాద్ అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మండలంలోని ముత్యుంజయపాలెంలో శనివారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి టిడిపి సూపర్‌ సిక్స్‌ పధకాలు, మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంచారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి రాబోయేది టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వమేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు విధానాలు, చేతగాని పరిపాలనను ప్రజలు భరించలేని స్థితికి వచ్చారని అన్నారు. మాయ మాటలు తప్ప ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి లేదని అన్నారు. ప్రజలంతా గత టిడిపి ప్రభుత్వ పాలన గుర్తుకు తెచ్చుకుని, మరోసారి అలాంటి పాలనే కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మహిళలు, యువత, రైతులు, అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా చంద్రబాబు మేనిఫెస్టో రూపొందించారని అన్నారు. కార్యక్రమంలో రేపల్లె రామాంజనేయులు, గుర్రం మురహరి, చిప్పల పార్థసారధి, బాలాజీ, నాగరాజు, పిచ్చయ్య, రవీంద్ర, కమతం శివ పాల్గొన్నారు.

➡️