రాజమండ్రిలో తెలుగు మహాసభలు

Jan 1,2024 00:49

ప్రజాశక్తి – అద్దంకి
తెలుగు భాషా వైభవాన్ని చాటి చెప్పే ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5, 6, 7తీదీల్లో రాజమండ్రికిలో జరుగుతున్నాయని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. స్థానిక రోటరీ కార్యాలయంలో అంతర్జాతీయ తెలుగు మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. సాహితీ మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన సభకు లక్కరాజు చంద్రశేఖర అధ్యక్షత వహించారు. శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆంధ్రమేవజయతే నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. డాక్టర్‌ కేశిరాజు శ్రీనివాస్, తెలుగు భాషాభిమాని చైతన్య రాజు జనవరి 5, 6, 7తేదీల్లో రాజమహేంద్రవరంలో శ్రీ రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. తెలుగు భాషలోని 25ప్రక్రియలపై సదస్సులు, గ్రంథావిష్కరణలు, కళాప్రదర్శనలు కన్నులపండుగగా జరుగుతాయని తెలిపారు. కవులకు, కళాకారులకు, సంస్థలకు పూర్ణకుంభ పురస్కార కార్యక్రమాలకు, కవి సమ్మేళనాలకు వేదికగా అలరించబోతున్నదని తెలిపారు. కార్యక్రమంలో కెవి పోలిరెడ్డి, లక్కరాజు శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, కొండకావూరి కుమార్, లక్కరాజు విశ్వమోహన్, వామరాజు వెంకటేశ్వరరావు, కుందాసుబ్బారావు పాల్గొన్నారు.

➡️