అన్న సంతర్పణ ప్రారంభం

May 23,2024 22:51 ##Bapatla #Annam #Kona

ప్రజాశక్తి – బాపట్ల
స్థానిక భావన్నారాయణ స్వామి 1431 వార్షిక రథోత్సవం సందర్భంగా మాజీ ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సందర్శకులకు అన్నసంతర్పణ గురువారం నిర్వహించారు. భవనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవంలో వేలాది మంది సందర్శకులకు అన్నదానం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19ఏళ్లుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం ప్రతి ఏడూ నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో బాబు నాగేంద్ర, కె సుబ్బారావు, వక్కల గడ్డ శ్రీనివాసరావు, దేశరాజు వెంకటరమణ బాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️