డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

Dec 7,2023 00:17

ప్రజాశక్తి – బాపట్ల
పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. పట్టణంలో 10వ వార్డు ప్యాడిసన్ పేటలో పరిశీలించారు. వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. పారిశుధ్యం లోపించిందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు నెలకొకసారి వస్తున్నారని ప్రజలు వాపోయారన్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేయించడంలేదని ఆరోపించారు.

➡️