ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలి

Dec 19,2023 00:28

ప్రజాశక్తి – బాపట్ల
సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రాష్ట్ర ల్యాండ్ టైటిలింగ్ చట్టం తక్షణమే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు భీమా లీలా కృష్ణ డిమాండ్ చేశారు. తహసిల్దారుకు వినతిపత్రం సోమవారం అందజేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి న్యాయవాదులు నల్లకోట్లు ధరించి లాండ్‌ టైటిల్‌ చట్టానికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా లీలా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెట్టిన ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్- 27/2023 రద్దు చేయాలని అన్నారు. ఈ యాక్ట్‌ రద్దు చేసే వరకు ఈనెల 22నుండి న్యాయవాదులు వివిధ రూపాల్లో నిరసన పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ యాక్టు వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తామని అన్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో మానవహారాలను ఏర్పాటు చేశారు. ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై నిరసన నినాదాలు చేశారు. ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేస్తూ ప్రదర్శన చేశారు. అనంతరం ప్రదర్శనగా వెళ్ళి తహసిల్దారు చిన్నం సుధారాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నంబూరు నరసింహారావు, పులిపాక రఘురామ్, దద్దుకూరి భాస్కర్, శ్రీరామమూర్తి, రామినేని వెంకటేశ్వర్లు, నల్లమోతు సుబ్బారావు, నందనవనం ప్రసాదరావు, విన్నకోట సత్య ప్రసాద్, జడ్ భాషా, చలపతిరావు, ఇమ్మడిశెట్టి బాలకృష్ణ, బిల్లా కమలకుమార్, బండి రామ్మూర్తి, సిహెచ్ ఆంజనేయులు, కె రవిబాబు, స్టాలిన్ కుమార్, సతీష్ రాజా, కొర్నేల్, లక్ష్మీనారాయణ, ఫిలిప్, ప్రేమ్ చంద్, వీసా తులసి, లేళ్ళ శ్రీనివాసరావు, మన్సూర్, డి కిషోర్ బాబు, మహిళా న్యాయవాదులు జిఎస్ నాగమోహిని, నాగలక్ష్మి, ఆకాంక్ష దివ్య పాల్గొన్నారు.

➡️