డ్రైవర్లపై ప్రవేశపెట్టిన చట్టాన్ని రద్దు చేయాలి

Jan 10,2024 00:27

ప్రజాశక్తి – చీరాల
స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై తెచ్చిన బిఎన్ఎస్ 106చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈచట్టంతో భవిష్యత్తులో డ్రైవర్ల ఉద్యోగాలకు మనుగడ ఉండదని అన్నారు. బిఎన్ఎస్ చట్టంతో పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్షలు జరిమానా, లైసెన్స్ రద్దు చేస్తారని అన్నారు. రానున్న రోజుల్లో డ్రైవర్ల ఉద్యోగాల్లో చేరేందుకు ఎవరు ముందుకు రారన్నారు. రోడ్లు సక్రమంగా ఉంటే యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎం వసంతరావు, కోటరెడ్డి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, భాష, జయరాజ్ పాల్గొన్నారు.

➡️