బకాయిదారులకు నల్లా కనెక్షన్‌ కట్‌..!

Jun 21,2024 10:15 #Cut, #debtors..!, #Nalla connection

హైదరాబాద్‌ : మొండి బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతుండడంతో.. హైదరాబాద్‌ జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా పెండింగ్‌ బిల్లులు పక్కాగా వసూలు చేయాలని నిర్ణయించి.. బకాయిదారులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే భారీగా బకాయి పడిన ఇంటి యజమానుల లిస్టును కూడా జలమండలి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వసూళ్లలో భాగంగా ముందుగా ఇంటి ఓనర్లకు నోటీసులు అందించనున్నారు. నోటీలు ఇచ్చినా చెల్లించడానికి ముందుకు రాకపోతే ఇంటి నల్లాల కనెక్షన్లను తొలగించనున్నట్టు సమాచారం. ఈ మేరకు జలమండలి ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
10 వేల రూపాయల కంటే ఎక్కువ మొండి బకాయిలు దాటిన గఅహ, వాణిజ్య నల్లాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. వీటితోపాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు సైతం జలమండలి నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా సంస్థల బకాయిలు కూడా భారీగా పెరిగిపోయాయి. జల మండలి అధికారుల అంచనాల ప్రకారం.. ప్రస్తుతం మ్నెత్తం బకాయిలు రూ.15వందల కోట్లు దాటాయట. ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయా శాఖ హెచ్‌ఓడీలకు జలమండలి అధికారులు లేఖలు రాయనున్నట్టు సమాచారం.
నీటి బిల్లులు, కొత్త నల్లాల ద్వారా జలమండలికి ప్రతి నెలా రూ.115 – రూ.130 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా. కానీ.. ఖర్చు అంతకు మించి ఉంటున్నట్టు సమాచారం. ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, కరెంట్‌ బిల్లుల కింద ఖర్చు దాదాపు రూ.160 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందట. ఈ నేపథ్యంలో నీటి బిల్లుల మొండి బకాయిలపై సీరియస్‌గా దఅష్టి సారించాలని నిర్ణయించిన అధికారులు.. కఠిన చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం.

➡️