నేతన్న నేస్తంతో చేనేతకు జీవం

Jan 1,2024 00:26

ప్రజాశక్తి – చీరాల
మండలం దేవాంగపురి పంచాయతీ పరిధిలోని అయోధ్య నగర్ గ్రామంలో ది శుభోదయం చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం నూతన భవనము ప్రారంభోత్సవ సభలో చీరాల శాసనసభ్యులు శ్రీకరణం బలరామ కృష్ణమూర్తి మాట్లాడారు. చేనేత అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం ఎంతో మేలు చేసిందని అన్నారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి నేరుగా ఆర్థిక సహాయం అందినదని అన్నారు. దీనివల్ల చేనేత వృత్తిపై కార్మికుల్లో ఆసక్తి పెరిగిందని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక రకాలను ఉత్పత్తి చేయడం ద్వారా చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. చేనేత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనo శ్రీనివాసరావు, చేనేత జౌలి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, మాచర్ల మోహన్ రావు, మేడా వెంకట్రావు, బండారుపల్లి హేమంత్ కుమార్, దేవన వీరనాగేశ్వరరావు, సజ్జ శ్రీనివాసరావు, కొలుకుల కుమార్, భూసం పుణ్యవతి, బాలసుబ్రమణ్యం, తిరు వీధుల సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

➡️