ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Dec 7,2023 00:25

ప్రజాశక్తి – బాపట్ల
విద్యాపరమైన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డీఈఓ పివిజె రామారావుకు వినతిపత్రం బుదవారం అందజేశారు. ఇన్విజిలేషన్ చేస్తూ సస్పెండ్ అయిన ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్ కాలాన్ని క్రమ బద్దీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈపురుపాలెం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయిని సూధావాణికి చైల్డ్ కేర్ లీవ్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పదో తరగతి స్పాట్ బకాయిలున్న ఉపాధ్యాయులకు చెల్లించాలని పేర్కొన్నారు. సిసిహెచ్‌ల నియామకానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. స్వచ్ఛంద పదవీవిరమణకు కుంకలమర్రు జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎస్ సుబ్బారావు చేసుకున్న దరఖాస్తును పరిశీలించాలని అన్నారు. జీతాల సమస్యలున్న రేపల్లె టౌన్, భట్టిప్రోలు, జాండ్రపేట, మక్కెనవారిపాలెం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అద్దంకి మండలం గొరకాయపాలెం ఉపాధ్యాయిని మెడికల్ రీయింబర్స్ మెంట్ మంజూరు ఉత్తర్వులో తప్పుగా వచ్చిన పేరును సవరించాలని కోరారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్‌సి కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కోశాధికారి వెంకటేశ్వరరెడ్డి, బాలాజీ, నారాయణ, పి శ్రీనివాసరావు, సురేష్, సంజయ్, సీనియర్ నాయకులు రత్నారాజు పాల్గొన్నారు.

➡️