వాలంటీర్ల సేవలు అభినందనీయం

Feb 24,2024 23:29

ప్రజాశక్తి – వేమూరు
స్థానిక మండల పరిషత్ సమావేశ హాలులో వాలంటీర్లకు వందనం సభ శనివారం నిర్వహించారు. వైసీపీ ఇన్చార్జి అశోక్ బాబు సభలో మాట్లాడారు. వాలంటీర్లకు అవార్డులు అందజేశారు. సభకు ఎంపీపీ యలమాటి మోహన్ అధ్యక్షత వహించారు. సభలో అశోక్ బాబు మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ ద్వారా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనను ప్రజలకు చేరువ చేశారని కొనియాడారు. ప్రజలకు వాలంటీర్లు అండగా ఉంటూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమైనదని అన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ బల్లిమంత ఏడుకొండలు, జడ్పిటిసి గాజుల హేమలత పాల్గొన్నారు.

➡️