గాన గంధర్వుడు ఘంటసాల

Feb 11,2024 22:53

ప్రజాశక్తి – బాపట్ల
గాన గంధర్వుడు, తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఘంటసాల వెంకటేశ్వరరావు గానం అజరామరమని ప్రజాకవి, వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఘంటసాల 50వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఘంటసాల విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు . ఘంటసాల వంద చిత్రాలకు భిన్నమైన బాణీలతో సంగీతం సమకూర్చారని అన్నారు. వెయ్యి పాటలకుపైగా గానం చేసి సినీ నేపథ్య గానంతో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని అన్నారు. సభకు సాహితీ భారతీయ అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ ఘంటసాల దేవదాసు, ప్రేమ్ నగర్, గుడి గంటలు, మూగ మనసులు వంటి చిత్రాలకు అద్భుతంగా గానం చేసి జీవనది లాంటి పాటలను అందించారని అన్నారు. కార్యక్రమంలో మర్రి మాల్యాద్రిరావు, ఆదం షఫీ, ఎం కృష్ణ, ఎం జాకాబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్ర మూర్తి పాల్గొన్నారు.

➡️