ఇసి నింబంధనలకు లోబడే తిరునాళ్లు

May 22,2024 23:06 ##Inkollu #Hanuman #Pavuluru

ప్రజాశక్తి – ఇంకొల్లు
పావులూరు పొలిమేర ఆంజనేయస్వామి తిరునాళ్ల రెండు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజుతో తిరునాళ్ల ముగియనుంది. రెండు రోజులుగా ఉపన్యాసాలు, హరికథా కాలక్షేపాలు దాతల సాయంతో నిర్వహించారు. రెండో రోజు బుధవారం ఉదయం విజయవాడ కూచిభట్ల వెంకటరమణ భాగవతార్ చే హరికథ, తెనాలి ములుకుట్ల విశ్వానాదాశర్మ చే ఉపన్యాసం, ప్రొద్దుటూరు నాయిని లక్ష్మీ కుమారి భాగవతారిని చే హరికద, డివి సుబ్బారావు కలయికతో సత్య హరిచంద్ర పూర్తి నాటకాన్ని ప్రదర్శించారు. 3వరోజున కూడా ఒంగోలు పిడుగు వేదవతి భాగవతారాణి చే హరికథ, సువర్చల సహిత శ్రీ వీరాంజనేయ స్వామి కళ్యాణం జరుపనున్నారు. ఈ సందర్భంగా అన్నదాన సత్రం వారిచ్చే అన్నదానం చేశారు. ఇంకొల్లు ఎస్‌బిఐ వారిచే మూడు రోజులు మంచినీటిని ఏర్పాటు చేశారు. 3వరోజు కమ్మ అన్నదాన సమైక్య సేవా సమితి, శ్రీ వీరప్రతాప్ ఆంజనేయస్వామి అన్నదాన సత్రం, శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి అన్నదాన సత్రం, బ్రాహ్మణ అన్నదాన సత్రం, నాయి బ్రాహ్మణ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానం చేయనున్నారు. ఎన్నికల నిబంధనలకు లోబడి విద్యుత్ ప్రభలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

➡️