క్రీస్తును కించపర్చిన వారిని శిక్షించాలి

Jan 17,2024 23:44

ప్రజాశక్తి – బాపట్ల
క్రీస్తును కించపరుస్తూ అసభ్యంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో దళిత సంఘాల నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ ఒక పథకం ప్రకారం క్రైస్తవుల్ని అవమానపరిచే విధంగా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు. కార్యక్రమంలో అంటరాని కుల నిర్మూలన వ్యవస్థాపక అధ్యక్షులు జి చార్వాక, శీలం రోజన్ బాబు, బిఎస్‌పి నియోజకవర్గ అధ్యక్షులు కొచ్చర్ల వినయ్ రాజు, అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు గుదే రాజారావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️