నేడు ఎన్నికల శంఖారావం

Mar 6,2024 00:54

ప్రజాశక్తి – వేమూరు
కొల్లూరు మండలం చిలుమూరు గ్రామం నుండి 2024 ఎన్నికల సమర శంఖారావాన్ని బుధవారం నుండి ప్రారంభిస్తున్నట్లు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. కొల్లూరు ఎంప్లాయిస్ రిక్రియేషన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన టిడిపి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమర శంఖారావాన్ని బుధవారం ఉదయం చిలుమూరు గ్రామ వేణుగోపాలస్వామి దేవస్థానం నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. టిడిపి, జనసేన సమన్వయంతో ఉమ్మడి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఆయా మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మైనేని మురళీకృష్ణ, కనకాల మధుసూధన ప్రసాద్, తూనుగుంట్ల సాయిబాబా, జొన్నలగడ్డ విజయబాబు పాల్గొన్నారు.

➡️