ప్రజా ప్రతినిధులకు యుటిఎఫ్‌ వినతి

Dec 25,2023 23:59

ప్రజాశక్తి – బాపట్ల
ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావుకు యుటిఎఫ్ జిల్లా నాయకులు చెరుకుపల్లిలో సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వినయ్ కుమార్, అడుగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ జెడ్‌పి పిఎఫ్, ఎపీజిఎల్ఐసి క్లోజర్లు రుణాలు, సరండర్ లీవు, డిఎ అరియర్స్, రిటైరైన ఉపాధ్యాయులకు రావలసిన పెన్షన్, గ్రా ట్యూటి, కమ్యుటేషన్ బకాయిల చెల్లింపుపై ఎంపికి తెలిపామని అన్నారు. వెంటనే చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరినట్లు తెలిపారు. జిల్లాలో అందుబాటులో వున్న ఎంఎల్‌ఎలు కరణం బలరామకృష్ణమూర్తి, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌కు యుటిఎఫ్‌ బాధ్యులు బండి బిక్షాలు బాబు, షేక్‌ జానీ బాషా, కందిమళ్ళ రవిబాబు, ఆదినారాయణ, సునీల్ కుమార్, పాలపర్తి రామాంజనేయులు, అనంతమ్మ, శేషగిరి, శ్రీనివాసరెడ్డి, గాలం వీరాంజనేయులు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు.

➡️