వరికూటి వరలక్ష్మి ఎన్నికల ప్రచారం

May 6,2024 23:57 ##ycp #Battiprolu #Varikuti

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పెద్దపులివర్రు గ్రామంలో వైసీపీ ఎంఎల్‌ఎ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు సతీమణి వరికుటి వరలక్ష్మి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలను కలిసి వైసిపిని గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు చర్చించారు. గత ఐదు నెలలుగా అమృతలూరు మండలం కూచిపూడిలో నివాసం ఉంటూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల్లో గెలిపించి ప్రజాసేవ చేసుకొనే అవకాశం కల్పించాలని కోరారు. వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి వరికుట్టి అశోక్ బాబు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్‌ను గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డిని సిఎంగా మరోసారి గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ డివి లలిత కుమారి, నాయకులు మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

➡️