వివేకానంద యువతకు ఆదర్శం

Jan 13,2024 01:05

ప్రజాశక్తి – అద్దంకి
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు చిన్ని మురళీ కృష్ణ, సెక్రటరీ చప్పిడి వీరయ్య, ట్రెజరర్ కొల్లా భువనేశ్వరి, పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఉబ్బా దేవపాలన, షేక్ మహమ్మద్ రఫీ, మలాది శ్రీనివాసరావు, అన్నంనేని వెంకట్రావు, గోనుగుంట సుబ్బారావు, చుండూరి మురళీసుధాకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవపాలన మాట్లాడుతూ వివేకానందుడు దైవాన్వేషణ పరంపరలో రామకృష్ణ పరమహంస శిష్యుడుగా మారి సర్వ మత సామరస్యం కొరకు కృషి చేశారని తెలిపారు. చికాగోలో సర్వ మత సభలో భారత కీర్తి ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తం చేశారని పేర్కొన్నారు. యువ జనులకు స్ఫూర్తినిచ్చే ఉపన్యాసాలు చేసినందున అయన జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా 1984నుండి జరుపుతుందని తెలిపారు.

➡️