తిరపతి వెళ్ళి పింఛను ఇచ్చిన వాలంటీర్

Mar 6,2024 00:59

ప్రజాశక్తి – చీరాల
వాలంటీర్ తన విధి నిర్వహిణలో బాగంగా తిరుపతిలో కిడ్నీ సమస్యతో బాధపడుతు మహిళకు వాలంటీర్ అనూష అక్కడకు వెళ్లి పింఛను నగదు అందజేశారు. సిఎం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో పట్టణంలోని 31వ వార్డులో 23వ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్ వనమా అనూష ఈనెల 1న పెన్షన్ తన కస్టర్లోని లబ్దిదారులకు పంపిణీ చేసుకొన్నారు. అయితే తన పరిధిలోని తన్నీరు వరలక్ష్మి ఆరోగ్యం బాగాలేక తిరుపతిలో కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని తిరుపతిలోని ఇంట్లో చికిత్స పొందుతూ ఉంది. ఆమెకు పెన్షన్ ఇచ్చేందుకు చీరాల నుండి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ రైలులో వెళ్లి అక్కడ పెన్షన్ ఇచ్చి తిరిగి 2న ఉదయానికి చీరాల వచ్చారు. ఈ సందర్బంగా వాలంటీర్ అనూష విధిపట్ల ఉన్నత అధికారులు, వార్డు ఇంచార్జి సల్లూరి అనీల్, సంచివాలయ సిబ్బంది అభినందించారు.

➡️