టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి

Dec 29,2023 00:02

ప్రజాశక్తి – నిజాంపట్నం
టిడిపితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన టిడిపి కార్యాలయం అయన గురువారం ప్రారంభించారు. టిడిపి జండా ఆవిష్కరించారు. అముదాలపల్లిలో టీడీపీ నాయకులు మరక ముసలయ్య ఆధ్వర్యంలో సుమరు 50, నిజాంపట్నంలో టీడీపీ నాయకులు బొమ్మిడి రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100మంది ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారని అన్నారు. జగన్‌కు మరో అవకాశం ఇస్తే నియంతృత్వం, అరాచక పాలనకు అవకాశం ఇచ్చినట్లేనని అన్నారు. రాజధాని లేకుండా ఐదేళ్లు పరిపాలించడం సిగ్గుచేటని అన్నారు. సంక్షేమం పేరిట ప్రజలపై ధరలు, పన్నుల భారాలను మోపారని చెప్పారు. అభివృద్ధి జాడే లేకుండా పోయిందని అన్నారు. టిడిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పాలన సాగిందని చెప్పారు. అరాచక పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని కోరారు. ఇదే ఉత్సహంతో మరో వంద రోజులు కష్టపడి పనిచేస్తే టిడిపి విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి మత్తి భాస్కరరావు, టిడిపి నాయకులు నర్రా సుబ్బయ్య, బొమ్మిడి రామకృష్ణ, పంతాని మురళీధరరావు, తాత ఏడుకొండలు, ఓగిపోయిన వెంకట యాదవ్, కేసన రామకృష్ణ పాల్గొన్నారు.

➡️