ప్రతి కుటుంబానికీ సంక్షేమం

Mar 2,2024 23:17

ప్రజాశక్తి – వేటపాలెం
ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైసిపి ఇన్చార్జి కరుణ వెంకటేష్ బాబు అన్నారు. మండలంలోని రామన్నపేట పంచాయతీలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 75శాతం గడప గడపకి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనుకోని సంఘటన వలన తన కాలికి దెబ్బ తగలడంతో కొంతమేర తిరగలేకపోయినట్లు తెలిపారు. కార్యక్రమంలో మల్లెల లలితరాజశేఖర్, వైసిపి మండల అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, సర్పంచ్ కందేటి రమణ, ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు, జెసిఎస్‌ మండల ఇంచార్జీ లేళ్ల శ్రీధర్, జిల్లా కార్యదర్శి రొండా భరత్, యువత అధ్యక్షులు ఆవుల అశోక్, ఆర్బికె చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, సీత మహాలక్ష్మి, అందే కృష్ణ, జంగిలి రామారావు, కట్టా గంగయ్య, కర్ణ లక్షరావు, వేటగిరి సంజీవరావు, ఫ్రుద్వి చంద్రమోహన్, సాధు రాఘవ, షేక్ ఖాదర్, నర్మద ప్రశాంతి, పొట్లూరి మహా లక్ష్మయ్య, గౌరవబత్తిన ప్రశాంతి, దంతం హనుమంతు, కర్ణ ప్రసాద్, గౌరవబత్తిన రవి, బండికళ్ళ నరేష్, జమ్మి ప్రసాదరెడ్డి, షేక్ అజిజుల్లా, బుర్ల శివ, షేక్ హౌలీ, లేళ్ల భాస్కరరావు, కోటి స్వామిగుప్తా, షేక్ సాలేహ, మురళి, బుద్ది రవి, ఎఒ కాశీ విశ్వనాథ్, ఎపిఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️