అర్హుల అందరికీ సంక్షేమ పథకాలు

Mar 1,2024 00:09

ప్రజాశక్తి – చీరాల
వైసీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు అన్నారు. మండలంలోని ఈపూరుపాలెం సచివాలయం-2 సిండికేట్ కాలనీ వద్ద గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లబ్ధిదారులతో నేరుగా కలిసి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. అర్హులైన వారందరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఒ శోభారాణి, ఎపీఎం సుబ్బారావు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, మల్లెల లలితరాజశేఖర్, వైసిపి మండల అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బిట్రా శ్రీనివాసరావు, నల్లబోతుల రాజ్ కుమార్, మేడా వెంకట్రావు, బుర్ల మురళీకృష్ణ, పర్వతనేనీ శ్రీనివాసరావు, బక్కా అద్దంకిరెడ్డి, పిక్కి నారాయణ, మారుబోయిన ప్రేమ్ చంద్ రెడ్డి, చప్పిడి రామచంద్ర, తేళ్ల రాంబాబు పాల్గొన్నారు.

➡️