తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి

Dec 14,2023 00:23

ప్రజాశక్తి – బాపట్ల
మిచాంగ్ తుఫాన్ వల్ల తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని టిడిపి ఇన్‌చార్జి వేగేశన నరేంద్ర వర్మ కేంద్ర బృందానికి వినతి పత్రం అందజేశారు. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు బాపట్ల జిల్లాకు విచ్చేసిన కేంద్ర బృందాన్ని చెరుకుపల్లిలో ఆయన కలిశారు. నష్టపోయిన పంటలు పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవడంతోపాటు తడిసి, రంగు మారిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.
చెరుకుపల్లి : పంట నష్టపరిహారం అంచనాలకు వచ్చిన కేంద్ర బృందానికి టిడిపి ఇన్చార్జి నరేంద్ర వర్మలు వినతి పత్రాన్ని అందజేశారు. అమర్తలూరు మండలం గోవాడకు కేంద్ర బృందం వచ్చారు. నష్టపరిహారం రైతులందరికీ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ సూచనల మేరకు వినతి పత్రం అందజేశారు. టిడిపి నాయకులు పూషడపు కుమారస్వామి, దివి రాంబాబు, ఎంఆర్‌కె మూర్తి, నాగుల పున్నారావు పాల్గొన్నారు.

➡️