సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Mar 6,2024 00:58

ప్రజాశక్తి – చీరాల
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు కోరారు. గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి మాట్లాడారు. మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తాజా మాజీ ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, వైసిపి ఇంచార్జి వెంకటేష్ బాబు పనితీరు పట్ల వాకర్స్‌ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు ఉన్నారు.

➡️