వైసిపి అభ్యర్థి వెంకటేష్ గెలుపుకు కృషి

Mar 21,2024 12:33 #Bapatla District

ప్రజాశక్తి – చీరాల : చీరాల నియోజకవర్గ జాగృతి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు చీరాల శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణ మూర్తిని మరియు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చo అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అక్కల పోలి రెడ్డి, ఉపాధ్యక్షులు రొండా భరత్ రెడ్డి, దోకి బ్రహ్మానంద రెడ్డి,సెక్రటరీ అప్పల శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రెటరీ పాకనాటి సుధాకర్ రెడ్డి, వాలి ఆదినారాయణ రెడ్డి, ఆట్ల చంద్రశేఖరరెడ్డి, ట్రెజరర్ కంచె సాంబిరెడ్డి, సలహాదారులు పిన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జరుగునున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వెంకటేష్ గెలుపుకు తమ సంఘం సహకారం పూర్తిగా అందిస్తుంది అన్నారు.

➡️