వైసీపీకి నష్టమేమీ లేదు

Jan 4,2024 00:09

ప్రజాశక్తి – కర్లపాలెం
జడ్పిటిసి పిట్ల వేణుగోపాల్‌రెడ్డి టిడిపిలో చేరడం వల్ల వైసిపికి ఎటువంటి నష్టం లేదని వైసిపి మండల కన్వీనర్ ఏడుకొండలు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడా. 2019లో జడ్పిటిసి, ఎంపీపీ టిడిపిలోకి వెళ్ళడం వల్ల 16వేలపైచిలుకు మెజారిటీతో గెలుపొందామని అన్నారు. ఈసారి దానికి డబల్ మెజార్టీతో గెలుస్తామని అన్నారు. ఆయన పార్టీ మారటం వల్ల అతని ఓటు తప్ప ఏ ఒక్క ఓటు తీసుకెళ్లే దమ్ము లేదని అన్నారు. ఏదో ఆశపడి పార్టీ మారడం తప్ప రేపటి రోజున ఆ పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదని అన్నారు. ఇలాంటి వారిని ప్రజలు ఎప్పటికీ నమ్మరని అన్నారు. పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు బయటకు పోయనంత మాత్రాన నష్టం ఏమి జరగదని అన్నారు. జగన్మోహన్‌రెడ్డిని మరలా సిఎంని చేసుకొని, బాపట్లలో కోన రఘుపతిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ సీతారామరెడ్డి, ఉపాధ్యక్షులు పందరబోయిన సుబ్బారావు, సర్పంచులు నక్క లలిత కుమారి, కాగిత కరుణకుమారి, శ్రీనివాసరెడ్డి, నాగాంజనేయులు రెడ్డి, నాని, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు ఆసిఫ్ ఆలీ, లక్ష్మీ సామ్రాజ్యం, రాతంశెట్టి లక్ష్మణ్, దిండి నాగలక్ష్మి, పులుగు సుబ్బారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పరమానంద కుమార్, కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరెడ్డి, నాయకులు పేరాల వెంకట సురేష్, తాజ్, వెంకటేశ్వరరెడ్డి, హరిబాబురెడ్డి, షేక్ ఇమ్రాన్, మనోహర్, నాగిరెడ్డి, బెనర్జీ పాల్గొన్నారు.

➡️