వైసిపీ నాయకులు రాజీనామా

Jan 1,2024 00:36

ప్రజాశక్తి – వేమూరు
మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసిపి రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వేమూరి మురళీకృష్ణ మాట్లాడుతూ తాము కష్టపడి పనిచేసి గత ఎన్నికల్లో వైసిపిని అధికారానికి తీసుకొస్తే గెలుపొందాకా తమను విస్మరించారని ఆరోపించారు. వైసిపికి ఓటు కూడా వెయ్యని వ్యక్తులను అందలం ఎక్కిస్తే తాము ఎందుకు పని చెయ్యాలని ప్రశ్నించారు. వేమూరు, వరాహపురం, బలిజెపల్లి, అబ్బానగూడవల్లి గ్రామాలకు చెందిన అనేక మంది వైసిపీ నాయకులు తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను పదేళ్లుగా రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్నానని, వైసిపి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సూన్యమని అన్నారు. అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడే పని చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాము మరో రెండు, మూడు రోజుల్లో తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.

➡️