నిన్నటి దాకా శత్రువులు నేడు మిత్రులా?

Feb 17,2024 00:18

ప్రజాశక్తి – అద్దంకి
నాలుగున్నరేళ్లుగా తిట్టుకుని నేడు మిత్రులుగా ప్రజల ముందుకు వస్తున్న నాయకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని, నమ్మి మోసపోవద్దని పరోక్షంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్యను ఉద్దేశించి వైసీపీ ఇంచార్జి హనిమిరెడ్డి విమర్శించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మహిళా పొదుపు, గ్రామ సహాయకులు, విఓఏలతో ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. వైసీపీ మాజీ ఇంచార్జి బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించి త్వరలో తమ అనుచరులతో టీడీపీలో చేరుతామని ప్రకటించిన నేపథ్యంలో హనిమిరెడ్డి ఆరోపణలు చేశారు. జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలు గుంపు కట్టినట్లే నియోజకవర్గంలో వైసీపీని ఎదుర్కొనేందుకు కొంతమంది గుంపు కడుతున్నారని అన్నారు. ఇక్కడున్న మహిళల మద్దత్తుతో ఆ గుంపును ఎదుర్కొంటామని ఆయన భరోసా ఇచ్చారు. వ్యక్తి గతంగా రాజకీయాలు తనకు కొత్తయినా సిఎంతో నేరుగా కలిసే సాన్నిహిత్యం ఉందన్నారు. అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకే జగనన్న తనను పంపారని అన్నారు. అందరి మద్దత్తుతో గెలిచి కానుకగా ఇవ్వాలన్నారు. విఒఏలుగా ఎన్నో మహిళా గ్రూపులు నడుపుతున్నారని అన్నారు. వారందరిని చైతన్యం చేసి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ప్రభుత్వం మారితే మీ పోస్టులన్ని రద్దుచేసి మరొకరికిచ్చే ప్రమాదం ఉందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలతో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సేవలను ఇంటిముందుకు తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు.

➡️