టికెట్‌ కోసం ప్రయత్నిస్తా : ‘బత్యాల’

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వచ్చిందని, ఆయన్ను కలిసి తనకు జరిగిన నష్టం కార్యకర్తలకు జరిగిన కష్టాన్ని వివరించి రాజంపేట అసెంబ్లీ టికెట్‌ దక్కే విధంగా ప్రయత్నం చేస్తానే తప్ప పార్టీ వీడే ప్రసక్తి లేదని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్రాయుడు అన్నారు. శనివారం బత్యాల భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారుతు న్నట్లు వచ్చిన ఆరోపణలన్నీ వదంతులేనని తెలిపారు. 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినా, రాజంపేట నియోజ కవర్గాన్ని గానీ, కార్యకర్తలను గానీ వీడకుండా నియోజక వర్గంలో పార్టీ బలోపేతానికి కషి చేశానని పేర్కొన్నారు. తనకు రావలసిన ఎమ్మెల్యే టికెట్‌ రాయచోటికి కేటాయించడం తనను బాధించిందన్నారు. టిడిపిని వీడే సమయంలో మేడా మల్లిఖా ర్జునరెడ్డి గంజాయి వనంతో పోల్చాడని, నేడు ఈ గంజాయి వనానికి తులసి మొక్కలు వలసలు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం తన భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తానన్నారు.

➡️