బిసిజి టీకాలను వినియోగించుకోవాలి

May 23,2024 23:30 #BCG Vaccine
Bcg Vaccination

ప్రజాశక్తి-మధురవాడ : మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్ని సచివాలయాల్లో క్షయ వ్యాధి నివారణ కోసం వేస్తున్న బిసిజి టీకాలను అందరూ వినియోగించుకోవాలని పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంతి కోరారు. పిహెచ్‌సి పరిధిలోని పలు కేంద్రాలు గురువారం బిసిటి టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. టీకాలు వేస్తున్న పలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఐదేళ్ల క్రితం టీబీ వచ్చిన తగ్గిపోయిన వారు, 18 ఏళ్లు నిండిన వారు, పొగ తాగేవారు, సుగర్‌ వ్యాధి గ్రస్తులు, బాడీ మాస్‌ ఇండెక్స్‌ 18 కన్నా తక్కువ ఉన్నవారు, టీబీ రోగులతో దగ్గరి సంబంధం ఉన్న వారు బీసీజీ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మధురవాడ టీబీ యూనిట్‌ సీనియర్‌ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌ వి.వీరబ్రహ్మం పాల్గొన్నారు.

➡️