అందుబాటులో ఉంటూ సేవ చేయండి : జెడ్‌పి చైర్మన్‌

Jun 14,2024 20:44

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో సాలూరు నియోజక వర్గం, మెంటాడ మండలం సర్పంచులు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసి సభ్యులతో శుక్రవారం మాజీ మంత్రి పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ సురేష్‌బాబుతో కలిసి సమావేశమయ్యారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, ప్రజా తీర్పును గౌర వింవాలని అన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించేం దుకు కృషి చేయాలని సూచించారు. నిరంతరం నియోజక వర్గం స్థాయిలో మాజీ ఎంఎల్‌ఎ పీడిక రాజన్నదొర, జిల్లా స్థాయిలో తాను కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి సన్యాసి నాయుడు, వైస్‌ ఎంపిపి ఈశ్వరరావు, రత్నాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️