అల్లూరి జిల్లాలో ఎలుగుబంటి దాడి

Apr 21,2024 14:45 #Alluri District

ప్రజాశక్తి -హుకుంపేట:- మండలంలోని కొట్నాపల్లి పంచాయతీ ఎగమాలపాడు కొండపైకి కట్టెల కోసం వెళ్లిన కొర్ర లచ్చన్న యువకుడు ఎలుగుబంటి దాడి చేయడంతో గాయాలు పాలయ్యారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం లచ్చన్ననీ, ఓ యువకుడు కట్టెల నిమిత్తం కొండపైకి వెళ్లి కట్టెలను సేకరించి తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యలో ఎలుగుబంటి జరిగింది.యువకుడికి తలపై బలమైన గాయాలు కావడంతో వైద్య సేవలు నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తలపైకి బలమైన గాయాలు కావడంతో 50 కోట్లు పడింది యువకుడు పరిస్థితి సీరియస్‌ గానే ఉందని వైద్యులు చెప్తున్నారు ఫారెస్ట్‌ అధికారులు దృష్టి సారించి ఎలుగుబంటి దాడిపై సమగ్ర విసరణ చేపట్టి గాయాలు పాలైన లచ్చన్నకు నష్టపరిహారం అందించాలని గిరిజన సంఘం మండల అధ్యక్షులు తాపుల కృష్ణారావు కోరారు.

➡️