పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం

ప్రజాశక్తి-యంత్రాంగం వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఆయా నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో పిఒ, ఎపిఒ, ఒపిఒ, మైక్రో అబ్జర్వర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఆయా కేంద్రాలను వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల ఎన్నికల అధికారులు విజరురామరాజు, అభిషిక్త్‌ కిషోర్‌ పోలింగ్‌ విధానాన్ని, అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఓటింగ్‌లో పాల్గొనే ఉద్యోగులకు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్‌ చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి అధి కారులను ఆదేశించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటు హక్కును విని యోగించుకున్నారు. సోమ, మంగళవారాల్లోనూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది.నేడు అత్యవసర సేవలందిచే వారికి పోలింగ్‌సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది అత్యవసర సేవలు అందించేవారికి సోమవారం పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూ పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వారందరూ ఆయా నియోజకవర్గాలలోని ఫెసిలిటేషన్‌ కేంద్రాలలో, ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు జిల్లా కేంద్రంలోని స్థాయి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని, ప్రశాంతంగా ఓటింగ్‌ ప్రక్రియ జరిగేలా అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొ న్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకో కుండా పోలీసు అధికారులు బందోబస్తును ఏర్పాటు చేశారు.నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ను పరిశీలిస్తే.. జిల్లా వ్యాప్తంగా 14,389 మందికి గాను 10,230 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 71.10 శాతం శాతంగా నమోదైంది. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో 1547 మందికి గాను 1386 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 89.59 శాతంగా నమోదైంది. రైల్వేకోడూరులో 1114 మందికి గాను 899 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80.70 శాతం నమోదైంది. రాయచోటిలో 2256 మందికి గాను 1894 మంది ఓటు వేయగా 89.18 శాతం, తంబళ్లపల్లెలో 1504 మందికి గాను 998 మంది ఓటు వేయగా 66.36 శాతంగా, పీలేరులో 2434 మందికి గాను 1702 మంది ఓటు వేయగా 69.93 శాతంగా, మదనపల్లెలో 3188 మందికి గాను 1445 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 45.33 శాతంగా నమోదైంది. వైఎస్‌ఆర్‌ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ను పరిశీలిస్తే…జిల్లా వ్యాప్తంగా 16540 మందికి గాను 13062 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84.28 శాతం శాతంగా నమోదైంది. మైదుకూరులో 1335 ఓట్లకు గాను 1325 ఓటు హక్కును వినియోగించుకున్నారు. 98.87 శాతంగా నమోదయింది. బద్వేలులో 2247 మందికి గాను 1695 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.24 శాతంగా నమోదైంది. జమ్మలమడుగులో 1,632కు గానూ 1,503 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92 శాతంగా నమోదైంది. పులివెందులలో 1835 ఓట్ల గాను 1608 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.63 శాతంగా నమోదైంది. కడపలో 3209 ఓట్లకు గాను 2700 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84.14 శాతంగా నమోదైంది. కమలాపురంలో 1290 ఓట్లకు గాను 1010 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78.29 శాతంగా నమోదైంది. ప్రొద్దుటూరులో 1342 మందికి గాను 1299 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 94.34 శాతంగా నమోదైంది. శాతంగా, పీలేరులో 2434 మందికి గాను 1702 మంది ఓటు వేయగా 69.93 శాతంగా, మదనపల్లెలో 3188 మందికి గాను 1445 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 45.33 శాతంగా నమోదైంది. వైఎస్‌ఆర్‌ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ను పరిశీలిస్తే…జిల్లా వ్యాప్తంగా 16540 మందికి గాను 13062 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84.28 శాతం శాతంగా నమోదైంది. మైదుకూరులో 1335 ఓట్లకు గాను 1325 ఓటు హక్కును వినియోగించుకున్నారు. 98.87 శాతంగా నమోదయింది. బద్వేలులో 2247 మందికి గాను 1695 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.24 శాతంగా నమోదైంది. జమ్మలమడుగులో 1,632కు గానూ 1,503 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92 శాతంగా నమోదైంది. పులివెందులలో 1835 ఓట్ల గాను 1608 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.63 శాతంగా నమోదైంది. కడపలో 3209 ఓట్లకు గాను 2700 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84.14 శాతంగా నమోదైంది. కమలాపురంలో 1290 ఓట్లకు గాను 1010 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78.29 శాతంగా నమోదైంది. ప్రొద్దుటూరులో 1342 మందికి గాను 1299 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 94.34 శాతంగా నమోదైంది.

➡️