ఎంపి అభ్యర్థిగా బెల్లాన నామినేషన్‌

Apr 22,2024 22:20

ప్రజాశక్తి-విజయనగరం కోట :  విజయనగరం పార్లమెంట్‌ స్థానానికి వైసిపి అభ్యర్థిగా ఎంపి బెల్లానచంద్రశేఖర్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. తన నామినేషన్‌పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.నాగలక్ష్మికి ందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మద్ది శ్రీనివాసరావు సహాయ సహకారాలతో మరోసారి ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించారని తెలిపారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. తన హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు తీసుకొచ్చామని, అనేక చోట్ల అండర్‌ బ్రిడ్జిలు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీస్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి వైసిపి నాయకులు బైకులు, కార్లతో భారీ సంఖ్యలో ర్యాలీగా వచ్చారు.

➡️