‘సూపర్‌ సిక్స్‌’తో మేలు

Apr 27,2024 21:27

ప్రజాశక్తి-బాడంగి, బొబ్బిలి : సూపర్‌ సిక్స్‌ పథకాల అమలుతో ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని టిడిపి అభ్యర్థి బేబీ నాయన అన్నారు. శనివారం మండలంలో ఎరుకల పాకాల, లక్ష్మి పురం, డొంకినవలస, తెంటువలస గ్రామాల్లో, బొబ్బిలి పట్టణంలో మూడో వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి మేనిఫెస్టోతో పేద ప్రజలకు మేలు జరగదని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్షుము నాయుడు, టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, నాయకులు పాలవలస గౌరు, సర్పంచ్‌ పార్వతి, జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, కౌన్సిలర్‌ బి.సురేష్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.ఉత్తరాంధ్రలో టిడిపి నుంచి ప్రజల మద్దతుతో అద్భుతమైన విజయం సాధించే తొలి అసెంబ్లీ నియోజకవర్గం బొబ్బిలి అవుతుందని లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. బేబినాయనని బాబ్జీ కలిసి లోక్‌ సత్తా పార్టీ తరపున సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆయన వెంట జిల్లా పౌర వేదిక అధ్యక్ష కార్యదర్శులు జలంత్రి రామచంద్రరాజు, పిడకల ప్రభాకరరావు ఉన్నారు. బేబినాయన విజయం సాధించాలని పాదయాత్రబొబ్బిలి :టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్ది బేబినాయన విజయం సాదించాలని కోరుతూ శనివారం గొల్లపల్లి గ్రామానికి చెందిన లోచర్ల కుమార్‌, లోచర్ల పవన్‌ గొల్లపల్లి శ్రీదాడితల్లి ఆలయం నుంచి సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. కోటలో బేబినాయనను వారిద్దరూ కలిసి శ్రీదాడితల్లి ఆలయం వద్ద పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు.

➡️