గిరిజన హక్కులను కాలరాస్తున్న బిజెపి

Apr 16,2024 21:55

బిజెపితోపాటు దాని పొత్తులు తొత్తు పార్టీలను ఓడించండి

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి 

అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స

ప్రజాశక్తి-సాలూరు, బలిజిపేట  : కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తుంటే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు దానికి మద్దతు నిలుస్తున్నాయని సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అన్నారు. మంగళవారం సాలూరు, బలిజిపేటలో ప్రచారం నిర్వహించారు. సాలూరులో స్టేట్‌బ్యాంకు నుంచి గాంధీనగర్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాలూరు రాజేశ్వరరావు పార్కులో గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సీదరపు అప్పారావు అధ్యక్షతన సభ జరిగింది. బలిజిపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి అప్పలనర్స మాట్లాడుతూ (మిగతా..3లో) ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపి నుంచి దేశాన్ని కాపాడాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని, దేశ ఐక్యతను దెబ్బతీస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను హక్కులు నిర్వీర్యం చేస్తుందని అన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ బిజెపి అవలంభిస్తున్న విధానాలు దేశ ఆర్థిక సామాజిక, స్వావలంభనకు తీవ్ర నష్టం చేస్తున్నాయని అన్నారు. అలాంటి బిజెపిని రాష్ట్రంలో వైసిపి, తెలుగుదేశం పార్టీలు బలపరచడం దుర్మార్గమైన చర్యని అన్నారు. దేశాన్ని మత ప్రాతిపదికను విడగొట్టడానికి సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ లాంటి చట్టాలు తీసుకువస్తూ వ్యతిరేకిస్తున్న వారిపై ఉపా వంటి దేశద్రోహ చట్టాన్ని అక్రమంగా మోపి నిర్బంధిస్తున్నారని అన్నారు. కావున రానున్న ఎన్నికలలో బిజెపిని, దాన్ని బలపరిచే టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించాలని, ప్రగతిశీల వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన సమయంలో గ్యాస్‌ ధర 400రూపాయలుంటే ఇప్పుడు 1200 రూపాయలకు పెరిగిందన్నారు .దేశ సంపదని మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ లకు అమ్మేస్తోందని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నదని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ చేస్తుంటే ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ నోరు మెదపడం లేదని చెప్పారు. బ్యాంకులను మోసం చేసిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ఉన్నత విద్యావంతుడు,యువకుడైన అప్పలనర్సను ఎంపీగా గెలిపించాలని కోరారు. సాలూరులో సిపిఐ నాయకులు ఎస్‌.రామచంద్రరావు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు ఎస్‌.బంగారయ్య, నాయకులు గేదెల రామకృష్ణ, సిపిఎం మెంటాడ మండల కార్యదర్శి రాకోటి రాములు, సాలూరు మండలం కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, పాచి పెంట మండలం కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు, మక్కువ మండల నాయకులు ప్రభాకర్‌, పట్టణ కార్యదర్శి ఎన్‌వై నాయుడు పాల్గొన్నారు.బలిజిపేటలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు, నాయకులు గేదెల సత్యనారాయణ, యమ్మల మన్మధరావు మండల నాయకులు భాను వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️