అభివృద్ధి చేశాం.. ఆశీర్వదించండి

Apr 30,2024 21:37

ప్రజాశక్తి – కొత్తవలస : వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో అభివృద్ధి చేశామని మరోసారి తమను ఆశీర్వాదించాలని వైసిపి ఎమ్‌పి అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మీ, ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు కోరారు. మంగళవారం వారు కొత్తవలస, డాబాలు, తుమ్ముకాపల్లి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పాలన అందించాం గనుకనే ఓట్ల అడిగే హక్కు తమకే ఉందన్నారు. ఎన్నికలప్పుడే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటు న్నామని గుర్తు చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అన్ని ప్రాంతాలను పర్యటించామని ఆ పరిస్థితుల్లో తెలుసుకున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, కొత్తవలస మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మూకల కస్తూరి, మండలంలో సర్పంచులు, ఎంపిటిసిలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.బొద్దాంలో వైసిపి ఇంటింట ప్రచారంవేపాడ : మండలంలోని బొద్దాం గ్రామంలో ఎంపిపి దొగ్గ సత్యవంతుడు, వైసిపి మండల అధ్యక్షులు మమ్ములూరి జగన్నాధం మంగళవారం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా కడుబండి శ్రీనివాసరావును, ఎమ్‌పిగా బొత్స ఝాన్సీలక్ష్మిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్‌పర్సన్‌ మూకల కస్తూరి, దుల్లా మహేష్‌ కుమారి, ఎంపిటిసి పిల్ల లక్ష్మి, వేపాడ మండల సర్పంచుల సంఘం ప్రెసిడెంట్‌ నిరుద్యోగ వెంకట్రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️