జిమ్సర్‌ వైద్య విద్యార్థుల రక్తదానం

May 10,2024 00:00 #blood camp, #Gitam
Gitam, Blood Camp

 ప్రజాశక్తి-మధురవాడ : రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్సర్‌) జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. దాదాపు 100 మంది వైద్యవిద్యార్థులు రక్తదానం చేశారు. ఎన్‌టిఆర్‌ రక్తనిధితో పాటు జిమ్సర్‌ రక్తనిధి వైద్యబృందం హజరయ్యారు. జిమ్సర్‌ ప్రో వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ బి.గీతాంజలి ముఖ్య అతిథిగా హజరై రక్తదానం అవసరాన్ని వివరించారు. ఏటా దేశంలో 5కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా 2.5 కోట్ల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. స్వచ్ఛంద రక్తదానం కోసం ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు.

➡️