రక్తపోటుపై అవగాహన ర్యాలీ

May 17,2024 20:00

ప్రజాశక్తి-విజయనగరం కోట  : ప్రపంచ రక్తపోటు దినోత్సోవం సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆశాఖ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, నియంత్రించండి.. ఎక్కువ కాలం జీవించండి’ అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత జీవన శైలిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, మార్పుల గురించి వివరించారు. ఆశా కార్యకర్తలు, సిబ్బంది రక్తపోటు దినోత్సవ నినాదాలు చేస్తూ, ర్యాలీని కొనసాగించారు. కార్యక్రమంలో డిఎల్‌ఎటిఒ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️