అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

Dec 6,2023 13:06 #Annamayya district
br ambedkar death anniversay in kottakota

ప్రజాశక్తి – బి.కొత్తకోట : ఆధునిక మనువు,భారత రాజ్యాంగ నిర్మాత డా.బి ఆర్.అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేద్దామని బాస్ జిల్లా కార్యదర్శి సింగన్న పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.బుధవారం బి.ఆర్.అంబేద్కర్ 67 వర్థంతిని పురస్కరించుకుని బి.కొత్తకోట జ్యోతి చౌక్ నందు ఉన్న బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన భారతీయ అంబేద్కర్ సేన.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పలక వెంకటేష్, తాలూకా అధ్యక్షుడు కొగర మాధవ, కమిటీ అధ్యక్షులు నలగోలమని,కొగర వెంకటేష్,సొట్ట గంగాద్రి, దుమ్ము శ్రీనివాసులు, మల్లెల రామాంజనేయులు, తాలూకా అధ్యక్షులు పోతిపేట రామచంద్ర, మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని,నిస్వార్థ సేవలను వివరించడమైనది.ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారత దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కే దక్కుతుందని కొనియాడారు.

➡️