మదనపల్లె నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా చమర్తి సురేష్‌ రాజు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (రాయచోటి-అన్నమయ్య) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాజంపేట మాజీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చమర్తి సురేష్‌ రాజును మదనపల్లె ఎన్నికల సమన్వయకర్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారాపు అచ్చెన్నాయుడు నియమించారు. ఈ మేరకు సోమవారం టిడిపి అధిష్టానం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సురేష్‌ రాజు మాట్లాడుతూ … తనపై నమ్మకంతో ఎన్నికల సమన్వయకర్తగా నియమించినందుకు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్‌ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జోన్‌ -4 ఇంచార్జ్‌ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామా గోపాల్‌ రెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌ మోహన్‌ రాజులకు ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. తనకు అప్పగించిన విధులను సక్రమంగా నెరవేర్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కఅషి చేస్తానని తెలియజేశారు.

➡️